మారుతి కారు బరువులో సగం బరువు, ఇంగ్లాండు రహదారి వేగ పరిమితికి అయిదింతల అత్యధికవేగం, మనిషి గుండె ఒక్కసారి లబ్ అని కొట్టుకునేసరికి పిస్టన్ దాదాపు అయిదుసార్లు కొట్టుకుంటుంది ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది దేని గురించి చెబుతున్నానో! ఆటోమొబైల్ రంగంపై ఆసక్తి ఉన్న వారందరికీ ఎంతో ఆసక్తి ఉన్న, మోటార్ రేసింగ్ లో అత్యున్నతమైన ఫార్ములావన్ రేసింగ్. ఎంతో ప్రసిద్ది పొందిన ఈ ఎఫ్ వన్ అర్థం కావాలని, ఈ ఆదివారం మొదలయ్యే సీజన్ ని దృష్టిలో పెట్టుకొని రాస్తున్నాను.
ఫార్ములా వన్ రేసింగ్‌కి దాదాపు అరవై సంవత్సరాల చరిత్ర ఉంది (ఇంకా ఎక్కువే ఉందికాని ఒక ప్రమాణ స్థాయికి వచ్చింది 1946 లోనె). ఈ రేసులన్నీ ఎఫ్. ఐ. ఏ. (Fédération Internationale de l'Automobile, ఒక ఫ్రెంచి నామం) ఆధ్వర్యంలో నిర్వహించబడుతాయి. ప్రతి సంవత్సరాన్ని ఒక సీజన్ గా పరిగణిస్తారు. ఒక సీజన్ కి ఇరవై -ఇరవైరెండు మంది డ్రైవర్లు, రమారమి పద్దెనిమిది గ్రాండ్ పిక్సులు(జిపి) అనబడే రేసులు, ఒకో జిపిలో 50-70 ల్యాప్స్, ఇన్నింటికీ కలిపి సవత్సరాంతానికి ఒక డ్రైవర్ ఛాంపియన్, ఒక కన్స్ట్రక్టర్ ఛాంపియన్(ఓ కన్స్ట్రక్టర్ అంటే చెప్పలేదు కదూ, ప్రతీ సీజన్ లో 10-11 కన్స్ట్రక్టర్ జట్లు పాల్గొంటాయి, కారు తయారీ దానిపై ఖర్చు, రాబడి, పరిశోధన, అభివృద్ది అన్ని హక్కులు బాధ్యతలు కన్స్ట్రక్టరువే. ఒక్కో కన్స్ట్రక్టరు తరపున ఇద్దరు డ్రైవర్లు పాల్గొంటారు.). ప్రతి సంవత్సరం మార్చిలో మొదలై అక్టోబరులో ముగుస్తుంది, ప్రతి జిపి వారాంతంలోనే నిర్వహిస్తారు. ప్రతి జిపి శుక్రవారం అభ్యాసంతో(ప్రాక్టీస్) మొదలవుతుంది. శనివారం నాడు క్వాలిఫైంగ్, ఆదివారం నాడు అసలైన రేసు. శుక్రవారం నాడు డ్రైవర్లు కేవలం పరిస్థితులకు అలవాటు పడటం, ట్రాకుపై అవగాహనకు రావడానికి వీలయినంత సేపు చక్కర్లు కొడుతుంటారు.
క్వాలిఫైంగ్
శనివారం జరిగే క్వాలిపైంగ్ ద్వారా ఆదివారం రేసులో ఎవరు ఏ స్థానం నుండి ప్రారంబించాలో నిర్ణయిస్తారు. ప్రారంభ స్థానం ఫలితాలను చాలా ప్రభావితం చేస్తుంది. మొదటి రెండు వరుసలలోని వారు జిపిని గెలిచే అవకాశాలను కలిగి ఉంటారు. ఈ క్వాలిఫైంగ్ మూడు దశలలో నిర్వహిస్తారు. మొదటి రెండు ఇరవై నిముషాలు మూడవది మరియు ఆఖరుది పదిహేను నిముషాలు ఉంటాయి. ప్రతి దశలో డ్రైవర్లు పిట్ ఇన్ (పిట్ ఇన్ అనగా కార్లను అనుకూలీకరించడానికి, ఇంధనం నింపడానికి, టైర్లు మార్చడానికి కేటాయించబడిన ప్రదేశం. ఇది స్టార్ట్ లైనుకి సమాంతరంగా పక్కనే ఉంటుంది, రేసు మధ్యలో ప్రతి కారు కనీసం ఒకసారైనా ఇంధనం మరియు టైర్ల మార్పిడికి వస్తుంది.) నుండి మొదలుపెడుతారు. సాధారణంగా ఇది స్టార్ట్ లైను దాటి ఉంటుంది కనుక ఈ లాప్ ని పరిగణించరు, ఒక పరిభ్రమణం చేసి స్టార్ట్ లైను చేరినప్పటి నుంచి సమయాన్ని లెక్కిస్తారు. దీనిని ఫ్లయింగ్ లాప్ అంటారు. ఈ సమయాన్ని లెక్కిస్తారు, ఒకవేళ ఆ డ్రైవరు తన ప్రదర్శనతో సంతృప్తి పడకపోతే ఆ దశకు కేటాయించిన సమ్యంలో మళ్ళీ లాప్ తిరగవచ్చు, పిట్ ఇన్ నుండి బయటకివచ్చే కారుకి కారుకి మధ్య నిర్దేశిత సమయం ఉంటుంది. ఏదేని కారు ఒక దశలోని సమయం అయిపోయే లోపు ఫ్లయింగ్ లాపు మొదలెడితే ఆ కారు లాపుని ముగించుకోవచ్చు.
మొదటి దశ అయిపోగానే ప్రతి డ్రైవరు ఉత్తమ ఫ్లైయింగ్ లాపు సమయాదారితంగా చివరి అయిదుగురిని తర్వాతి దశకు అనర్హులుగా పరిగణించి, వారిని రెసుకు నిలబడే వరుసలో చివరి అయిదు స్థానాలను వారి సమయాల ఆధారితంగా కేటాయిస్తారు. రెండవ దశలో కూడా చివరి అయిదుగురికి ఇలాగే పది నుండి పదిహేను స్థానాల వరకు కేటాయిస్తారు. మిగిలిన పది మందికి చివరిదైన మూడవ దశలో పదిహేను నిముషాల దశ ద్వారా వారి వారి స్థానాలను కేటాయిస్తారు. రెండవ దశ అనంతరం మూడవ దశ ఆరంభానికి మధ్య ఉండే సమయంలో అందరికీ ఇంధనం నింపుకునే అవకాశం ఇస్తారు, మళ్లీ రేసు ప్రారంభమయ్యే వరకు ఎవరూ కూడా మళ్లీ ఇంధనం నింపుకునే అవకాశం లేదు, అంటే రేసు ప్రారంభమైన తరువాత ఎప్పుడైనా మళ్లీ ఇంధనం నింపుకోవచ్చు. అందుకే మూడవ దశలో నమోదు చేసే సమయాలు మొదటి మరియు రెండవ దశల సమయాలకంటే ఎక్కువ ఉంటాయి.
క్వాలిఫయింగ్ ముగిసిందంటే ఇక మిగిలేది ఆదివారం నాటి రేసు మాత్రమే. ప్రతీ రేసు దాదాపుగా యాభై నుండి డెబ్బై లాపులుంటాయి, దాదాపుగా గంటన్నరలో అయిపోతుంది. రేసు ప్రారంభ స్థానాన్ని బట్టి వ్యూహాన్ని రచించుకుంటారు. ముందుగా చెప్పినట్టు ప్రతికారు ఒక్కసారైనా ఇంధనం టైర్లకోసం ఆగాలి, ఇంతకుముందు ఇది నిబంధన కాదు కాని ఇప్పుడు ప్రతీ రేసులో రెండు రకాల టైర్లు వాడాలన్న నిబంధన పెట్టారు. టైర్లలో అనేక రకాలుంటాయి వాతావరణాన్ని బట్టి, ట్రాకును బట్టి టైర్లను ఎన్నుకుంటారు. ఏది ఎలా ఎన్నుకున్నా కనీసం ఒకసారి గట్టివి ఒకసారి మెత్తనివి వాడాలి. వ్యూహాన్ని బట్టి ఒకటి లేదా రెండు సార్లు పిట్ ఇన్ లోకి వెలుతుంటారు. ఇక వర్షం లాంటివి సంభవించినప్పుడైతే డ్రైవర్లకు ప్రాణసంకటం అభిమానులకు చెలగాటం అన్న రీతిలో ఉంటుంది. డ్రైవర్లకు మరీ ప్రాణసంకటం కాదు గాని కత్తి మీద సామే, ఇది నొక్కి చెప్పవచ్చు ఎందుకంటే 1994లో సాన్ మారినోలో అయెర్టన్ సియెన్నా మరణం తరువాత ఎఫ్.ఐ.ఏ తీసుకున్న నిర్ణయాల వలన ఇంతవరకు స్టీరింగు వెనక ఎవరి ప్రాణం పోలేదు.
కొన్ని నిజాలు
ఒక ఫార్ములా వన్ కారులో 80,000 విడిభాగాలుంటాయి. ఖచ్చితత్వం ఒక్క శాతం తగ్గినా ఎనిమిది వందల భాగాలు బాధపడుతున్నట్టే,
ఒక రేసు వారాంతం ముగిసే సరికి ఒక డ్రైవరు రెండు నుంచి నాలుగు కిలోల బరువు కోల్పోతాడు,
ప్రతీ కారు కనీసం 650 కిలోల బరువు ఉండాలి( డ్రైవరుతో కలిపి),
ప్రతీ కనస్ట్రక్టర్ తన బడ్జెట్లో యాభై శాతం ఇంజిన్ కోసం కేటాయిస్తాడు, ఒక ఇంజిన్ జీవితకాలం ఒక వారాంతం మాత్రమే,
బ్రేకులకోసం వాడే డిస్కుల వద్ద ఉష్ణోగ్రతలు వేయి డిగ్రీలను మించుతుంటాయి,
కారులోని కాక్‌పిట్ ఎంత ఇరుకుగా ఉంటుందంటే డ్రైవరు బయటికి రావాలంటే స్టీరింగు తీసివేసి బయటకు రావాలి, స్టీరింగు ఎంతకీలకం అంటే గేర్లు, క్లచ్ కూడా స్టీరింగుపైనే ఉంటాయి.
కారు ఏరోడైనమిక్స్ రూపొందించేటప్పుడు ఏదైనా తేడాలొస్తే ఇక ఆ కారు విమానాల పోటీకే,
కొన్ని రేసులు సాధారణ వీధుల్లో నిర్వహిస్తుంటారు, ప్రధానంగా మొనాకోలో ఇటువంటి రేసుల్లో రోడ్డుపై మాన్‌హోల్ ఉంటే కారుతో పాటు మాన్‌హోల్ మూతకూడా కొట్టుకపోతుంది. అందుకే రేసు కంటే ముందే అన్నింటిని వెల్డింగ్ చేస్తారు,
కారులకు వాడే ఇంధన రిగ్గుల వంటివే హెలీకాప్టర్లకు వాడుతారు, ఇంధనం నింపే పంపు సేకనుకు పన్నెండు లీటర్లు నింపుతుంది,
సాధారణ టైర్లు లక్ష కిలోమీటర్లు పనిచేస్తే ఎఫ్ వన్ టైర్లు కేవలం తొంభై నుండి నూట ఇరవై కిలో మీటర్ల వరకే పనిచేస్తాయి,
టైర్లు 800-900 C ఉష్ణోగ్రత వద్ద వాటి ఉత్తమ ప్రదర్శనను వెలువరుస్తాయి, అత్యధిక వేగం వద్ద టైరు సెకనుకి యాభై చుట్లు తిరుగుతుంది.
ఈ వారమే మొదలైన సీజన్ మొదటిరేసు ఆస్ట్రేలియాలో, రేపు అనగా శనివారం ఉదయం 0600GMT కి క్వాలిఫయింగ్, ఆదివారం ఉదయం కి రేసు ఆసక్తి ఉన్న వారు చూడండి.

1 comments:
very informative and interesting.
Post a Comment