కత్తి మహేశ్ గారి ప్రోద్బలంతో గత సోమవారం 'గులాల్' సినిమా చూడడం జరిగింది. ఆ సినిమా బాగా నచ్చడంతో అనురాగ్ కాశ్యప్(దర్శకుడు) మిగతా అన్ని సినిమాలు చూడాలని నిశ్చయించుకొని ఆదివారాన్ని ప్రారంబించాను. పొద్దున్నే మరొకసారి 'గులాల్' మళ్లీ చూసా(హిందీలో ప్రావీణ్యం అంతంత మాత్రమే మొదటిసారి అంతరార్థం అర్థం కాలేదని రెండో సారి), వెనువెంటనే 'దేవ్ డి' కాస్త బోర్ అనిపించింది మధ్యలో కాని ఒక టి మాత్రం నిజం థియేటర్లలో తప్ప నేను పాటలు చుసిన సినిమాలు లేవని చెప్పొచ్చు, ఈ రెండు సినిమాలకు పాటలు కూడా చూసా. 'దేవ్ డి' సినిమా అంతగా ఆకట్టుకోలేదు కాని పాటలు బాగా నచ్చాయి. బ్రాస్ బ్యాండ్ పాట బాగ నచ్చింది, ఏదో మన ఊళ్లో బ్రాస్ బ్యాండ్ మాదిరి.
దాని తర్వాత ఇంకేం సినిమాలు తీసాడా అని చూస్తే 'పాంచ్', 'బ్లాక్ ఫ్రైడే', 'నో స్మోకింగ్'. పాంచ్ విడుదలకు నోచుకోలేదు కాబట్టి చూసే అవకాశాంలేదు, కాబట్టి బ్లాక్ ఫ్రైడే చూసా. సినిమా మొత్తం బొంబాయి(అప్పట్లో బొంబాయే కదా) పేలుళ్ల గురించే, చాలా ధైర్యంతో ఎంచుకున్న కథ. ఈ సినిమాని మూడు సంవత్సరాలు కోర్టు ఆపడం పెద్ద వింత ఏమి కనబడలేదు, ఇదే నేపధ్యంలో మణిరత్నం తీసిన 'బొంబాయి' లో పేలుళ్లకు సంబంధించిన తీవ్రత ఒకటి అనుకుంటే దీనిలోని తీవ్రత పది. కథ మొత్తంగా పేలుళ్ళ కేసు విచారణ ఎలా సాగింది, పేలుడు పదార్థాల రవాణా ఇలా ఇదీ అదీ అని కాకుండా పేలుళ్లకు కారణమైన ప్రతీ విషయాన్ని స్పృషించాడు. మూడొంతుల సినిమా అయిపోయే వరకు ముస్లింలదే తప్పు అన్నట్టు చూపిస్తుంటే ఒక పార్శ్వాన్నే చూపుతాడనుకున్నా కాని చివర్లో మూలకారణాలను చూపే ప్రయత్నం కూడా చేసారు. కాస్త డాక్యుమెంటరీలా అనిపిస్తుంది కాని బాగుంటుంది(బొంబాయి పేలుళ్లు జరిగినప్పుడు నాకు కేవలం తొమ్మిది సంవత్సరాలే కావడంతో నాకు సరిగ్గా అప్పటి పరిస్థితుల గురించి పెద్దగా తెలీదు, ఈ సినిమా వాటి గురించి తెలుసుకోవడానికి దోహదం చేసింది).
ఇక మిగిలిన సినిమా 'నో స్మొకింగ్' ఇది కూడా నిన్ననే చుసేసా మహేష్ గారు రాసినట్టు 'బాగుంది కాని అర్థంకాలేదు' అనేది చాలా మంది అభిప్రాయం, ప్రస్తుతానికి నాది కూడా.
మొత్తానికి నా ఆదివారాన్ని కాశ్యప్ మింగేసాడు, ఇది ఇక్కడ ఆపకుంటే నా సోమవారాన్ని కూడా!

2 comments:
అనురాగ్ కాశ్యప్ సినిమాల్ని మరింత బాగా అర్థం చేసుకోవడానికి కొంత "ముందు వెనుకలు" తెలుసుకుంటే మంచిది. అలా తెలుసుకోవాలంటే http://passionforcinema.com/author/anurag/
పై లంకెను చూడండి.
@కత్తి మహేశ్ గారు
ఆదివారం క్షవరంలో అది కూడా అయ్యిందండీ! చివరగా రాత్రి చదివా కాని ఇంకా చదవాలి :)
Post a Comment