Wednesday, October 21, 2009

లస్టర్ లో దీపావళి

దీపావళి, భారతదేశంలో ఎంత ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారో ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. కాని భారత భూభాగం ఆవల అంత ఘనంగా ఎక్కడ జరుపుతారో ఎక్కువ మందికి తెలియక పోవచ్చు, భరతభూమి ఆవల ఘనంగా వేడుకలు గ్రేట్ బ్రిటన్లోని లెస్టర్।లో (లీసెస్టర్ అని రాస్తారు కాని లెస్టర్ అనాలి, ఈనాడు దినపత్రికలో కూడా లీసెస్టర్ అనే రాస్తారు :() నిర్వహిస్తారు.
ఈ సారి వేడుకలకి నేను కూడా వెళ్ళాను. ఎప్పటిలానే పట్టణ నడిబొడ్డులో దాదాపు ఒక కిలోమీటరు మేర రోడ్డు(బెల్।గ్రేవ్ రోడ్డు), దానికి కొనసాగింపుగా ఉన్న ఒక ఫ్లైఓవరును(బెల్।గ్రేవ్ ఫ్లైఓవర్) మూసివేసి మరీ ఈ వేడుకలు జరిపారు. దాదాపుగా పదివేల మంది ఈ వేడుకలకు హాజరయ్యారు, పట్టణ మేయర్ విద్యుద్దీపాలని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు(ఏదో సాంస్కృతిక అనే పేరేగాని అంతటా దర్శనమిచ్చే కుప్పిగంతులే) మొదలయినాయి. బెల్।గ్రేవ్ రోడ్డుపై రకరకాల తినుబండారాల స్టాల్స్।తో ఒక జాతరను తలపించింది. అయితే ఎందుకో తెలీదు కాని ఒక ఇద్దరు వేషగాళ్లతో గణపతి, దుర్గా(అనుకుంటా) దేవి వేషాలు వేయించారు అవి ఏ విధంగా నేపథ్యానికి సరిపోతాయో అర్థం కాలేదు. చివరగా పక్కనే ఉన్న మైదానంలో ఫైర్।వర్క్సు ఏర్పాటు చేసారు. అసలు ఆ పదివేల మందిలో పట్టుమని పదిమందికి కూడా సాంస్కృతిక కార్యక్రమాల మీద ఆసక్తి లేదు, అందరు ఫైర్।వర్క్స్ కోసమే ఎదురుచూసారు. అందరి ఎదురు చూపులకు తగ్గట్టుగా బాణాసంచా కనువిందు చేసింది. అక్కడ తీసిన చిత్రాల మాలిక కింద ఇస్తున్నాను.....


కొసమెరుపు: ఇక్కడ(లెస్టర్।లో) గత జూన్।లో గాంధీ విగ్రహావిష్కరణ జరిగింది, ఇంకో విషయం ఈ మధ్య దివాలీ, దీపావళి చర్చలో దీపావళి అనే పదమే సరైందని చెప్పే ఒక సమర్థనీయ వ్యాఖ్య ఈ వార్తను ప్రచురించిన బిబిసి కథనంలో కనిపించింది.

6 comments:

SRRao said...

'కన్నగాడు' గారూ !
ఈ సంబోధన బాగు లేదండీ! మీరు ప్రత్యామ్నాయం చూపించండి. దేశం కాని దేశం లో దీపావళి సంబరాలు జరుపుకున్న మీకు, అందరికీ దీపావళి శుభాకాంక్షలు.

కన్నగాడు said...

@రావు కన్నగాడు అనండి పర్లేదు

అబ్రకదబ్ర said...

మొత్తానికి బీబీసీ వాళ్లు కూడా నా దివాలీ గోల చదివారన్నమాట ;-)

Jokes aside - 'దీపావళి' కరెక్టు, 'దివాలీ' కాదు అన్న విషయానికి బీబీసీ అటెస్టేషన్ కావాల్సొచ్చిందన్నమాట. తెల్లోడు చెబితేనే మనకి ఎక్కుద్ది కదా!

అబ్రకదబ్ర said...

Btw, మీ టపా శీర్షిక 'దీపానళి' అని కనిపిస్తుంది.

కన్నగాడు said...

@అబ్రకదబ్ర చెప్పేవాళ్లు చెబితేనే వినేవాళ్లు వింటారు, ఎలాగంటే వివేకానంద చికాగో వెళ్లినట్లు.
నేను సాధారణంగా ఆంగ్లంలో చిన్న సైజు అక్షరాలు వాడుతా, ఆ సైజులో తెలుగు ఇంకా చిన్నవి అయిపోయి 'న'కి'వ'కి తేడా తెలియలేదు. ఇప్పుడు మార్చాను.

అబ్రకదబ్ర said...

అలాంటిదే ఏదో ఉందని ఊహించా. అందుకే 'కనిపిస్తుంది' అన్నా - 'అప్పు తచ్చు రాశారు' అనకుండా :-)

Google Analytics Alternative