ప్రస్థుత కాలంలో పాటలు వినడానికి అతి ఎక్కువగా ఉపయోగించే పరికరం ఐపాడ్, దానిని పనిచేయించాలంటే కావాల్సిన అతి ముఖ్యమైన సాఫ్ట్।వేర్ ఐట్యూన్స్. ఐట్యూన్స్ అంతర్జాల దుకాణంలో కొన్న పాటలను నిర్వహించడానికి వాడకందారు శ్రమ ఖర్చు చేయనక్కరలేదు(ఎందుకంటే శ్రమకు ఒక రూపమైన డబ్బును ఖర్చుచేసేసాడు కనుక), కాని సి.డి. లేదా ఇతర మాధ్యమం ద్వారా దిగుమతి చేసుకున్న పాటలను నిర్వహించాలంటే శరీర శ్రమని ఖర్చు చేయక తప్పదు. దానికి కొన్ని చిట్కాల కోసమే ఈ టపా.
సాధారణంగా పాటలను పొందుపరిచేది తరువాత సులభంగా తిరిగి పొందేటందుకే, ఈ తిరిగిపొందటమనేది ఏదేని అంశం ఆధారంగా తీసుకొని కావచ్చు(ఉదా: కళాకారుడు, చలనచిత్రం పేరు, విడుదలైన సంవత్సరం....... మొ.), ఈ అంశాల ద్వారా పొందాలనుకున్నప్పుడు ఈ వివరాలన్ని ముందుగా నిక్షిప్తం చేసుకోవాలి. కాస్త క్లిష్టంగా అర్థం కాకుండా ఉందా, విపులంగా చెబుతా. ప్రతి ఎమ్పీ౩ పాట ఒక తోకను కలిగి ఉంటుంది, ఇదీ కేవలం సమాచారాన్ని నిక్షిప్తం చేసుకుంటుంది దీన్నే టాగ్ అంటారు. ఈ తోకలలోని సమాచారాన్ని చదివే ఐట్యూన్స్ పాటలని వెదుకుతుంది. కాబట్టి ఐట్యూన్స్ నిర్వహణకి ఈ తోకల నిర్వహణే కీలకం, ఈ తోకలని ఐట్యూన్స్ లో ఎలా కూర్చుకోవచ్చో చూద్దాం(ఈ పేరా అర్థం కాకపోతే అస్సలు చింతించాల్సిన పని లేదు. ముందుకు సాగిపోండి).
ఐట్యూన్స్ నిర్వహణ కోసం నాకై నేను కొన్ని నియమాలు పెట్టుకొని ఒక ప్రమాణాన్ని తయారుచేసుకున్నాను, ఇది ఎవరి అవసరాలకు తగ్గట్టు వారు సవరించుకుంటే బాగుంటుంది.
టాగ్।లో పాటకి సాధారణంగా కింది ఫీల్డ్స్ ఉంటాయి,
నేమ్ : పాట పేరు
ఆర్టిస్ట్ : సాధారణంగా మన పాటలన్ని సంగీత దర్శకుడి కేంద్రంగా ఉంటాయి కనుక ఈ విభాగంలో సంగీత దర్శకుడి పేరు
ఆల్బమ్ ఆర్టిస్టు : ఇక్కడ పాట పాడిన వారి పేరు రాయడం ముదావహం. (ఈ ఫీల్డు పూరించడం వలన కొన్ని సమస్యలున్నాయి, ఐట్యూన్స్ సాధారణంగా ఆల్బమ్ ఆర్టిస్ట్ అధారితంగా పాటలని గుంపులుగా విడదీస్తుంది దానివల్ల ఒక సినిమా పాటలే ఒక్కో పాటకి ఒకో ఆర్ట్ వర్కుతో కనిపిస్తుంది ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇలా. ఇంకో సమస్య ఏంటంటే ఎంతమంది ఆల్బమ్ ఆర్టిస్టులుంటే అన్ని సార్లు ఐపాడులోకి మొత్తం పాటలు సింక్ అవుతాయి. అంటే సప్తపది సినిమాలో ఆరు పాటలు ఆరుగురు పాడారనుకుంటే, ఐపాడులో సింక్ చేసినపుడు ఆరు పాటలు ఆరుసార్లు కాపీ అవుతాయి. అందుకే ఈ ఫీల్డు వదిలేయడం మంచిది.)
ఇయర్ : సినిమా విడుదలైన సంవత్సరం
ఆల్బమ్ : సినిమా పేరు
గ్రూపింగ్ : ఈ ఫీల్డు సాధారణ బ్లాగు టపాలకుండే లేబుళ్ల మాదిరిగా పని చేస్తుంది, మీకు పాటకు సంబంధించి ఏదైనా లేబుళ్ ఇస్తే బాగుంటుందనుకుంటే ఈ ఫీల్డ్ వాడుకోవచ్చు (ఉదా: హీరో/హీరోయిన్ పేరు, పాట పాడిన వారి పేరు ....), కామాతో వేరు చేస్తు ఎన్నైనా రాసుకోవచ్చు.
కంపోజర్ : ఈ ఫీల్డుని నేను రచయిత కోసం కేటాయించా కాని సమయాభావం మరియు ఇతరత్రా కారణాల వల్ల ఈ ఫీల్డుకి అన్యాయం జరుగుతోంది.
కామెంట్స్ : ఖాళీగా వదిలే ఫీల్డు, దేనికి వాడాలో నిర్ణయించలేదు,
జెనర్/జాన్రా (ఏదో ఒకటి) : మన పాటలు సినిమాలకి జ్../... నిర్ణయించలేని నిస్సాహయత ఈ ఫీల్డుని భాషకోసం వాడుకోరా అంది, అందుకే హిందీ, ఇంగ్లీషు పాటలకి ఆ పేరు రాస్తా, ఏదీ రాయకపోతే తెలుగని అర్థం.
ట్రాకు నం., డిస్కు నం,. బిపిఎమ్ : ఇలాంటి వాటిల్లో ఏమి రాయొద్దని మా నాన్న గారు చెప్పారండి :).
లిరిక్స్ : పాట సాహిత్యం ఎక్కడైనా అంతర్జాలంలో దొరికితే (తెలుగులో మాత్రమే) ఇక్కడ దాచేస్తాను. ఐపాడులో తెలుగు యూనికోడు సరిగా కనిపిస్తుందో లేదో తెలీదు కాని ఐఫోనులో మాత్రం సరిగా కనిపించదు కానీ భవిష్యత్ మీద నమ్మకంతో సాహిత్యం భద్రపరుస్తున్నా.
ఆర్ట్ వర్క్ : సినిమాకు సంబంధించి ఒక పోస్టరు.
ఇంకా చాలా ఉంటాయి కానీ ఇవి ముఖ్యమైనవి.
ఇక లోపలికేళితే(ఏ లోపలికి అనే లాంటి కొచ్చెన్లకు జాగలేదు), పాటలని దిగుమతి చేసుకోగానే పక్క చిత్రంలో చూపినట్టు "డేట్ ఆడెడ్" ఆధారంగా సార్ట్ చేసుకోవాలి, ఇప్పుడే దిగుమతి అయిన పాటలు ఒక దగ్గర, అన్నింటి కంటే ముందు చూపిస్తుంది.
దిగుమతి చేసుకున్న అన్ని పాటలని ఎంచుకొని, రైట్ క్లిక్ చేసి 'గెట్ ఇన్ఫో' ని ఎంచుకోవాలి. అప్పడు కింది విండో లాంటిదొకటి వస్తుంది,(గమనిక: మొదటిసారి ఇంకో చిన్న పాప్ అప్ విండో, మల్టిపుల్ ఫైల్స్ ఎడిట్ చేయాలా అని అడుగుతుంది, ఎస్ అని క్లిక్ చేయండి).
దాదాపు ఇంతకుముందు చెప్పిన ఫీల్డులన్నీ ఇక్కడ గమనించవచ్చు. ఇది 'సప్తపది' సినిమా పాటల ఇన్ఫో విండో, ఫీల్డులు పైన చెప్పిన విధంగా కాని మీకు నచ్చిన విధంగా కాని నింపవచ్చు.
ఒకటికి మించి పాటలు ఎంచుకున్నందున ఇందులో నేమ్ అనే ఫీల్డు కనిపించదు. ఆర్టువర్క్ ఫీల్డ్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఇంకో విండో తెరుచుకోని మీ కంప్యూటరు నుండి ఫోటోని ఎంచుకోమంటుంది.
"It's That Simple".
ఇంకా దేనికోసం ఆగారు, ఓకే నొక్కండి.
గ్రూపింగు ఫీల్డు బ్లాగుల లేబుళ్ల ఫీల్డు మాదిరిగా పనిచేస్తుందనుకున్నాం కదా అదెలాగో చూద్దం. ఐట్యూన్స్ లో ఒక మంచి పరికరం "స్మార్ట్ ప్లే లిస్ట్". దీనికోసం file -> New smart play list ని క్లిక్ చేయగానే ఒక కొత్త విండో వస్తుంది అందులో మన స్మార్ట్ ప్లే లిస్టు కి నిబంధనల్ని ఎంచుకోవాలి. ఇందులో మొదటి ఫీల్డులో దాదాపుగా ఇరవై-ముప్పై వివిధ రకాల ఐచ్చికాలుంటాయి. వీటిల్లో ఇంత క్రితం మనంరాసినవే కాక ఇంకా చాలా ఉంటాయి (ఉదా: ప్లే కౌంట్, రేటింగ్, డేట్ ఆడెడ్.......మొ.) అందులో నుండి ఒకటి ఎన్నుకున్న తరువాత ఒక క్రిందకు జారే ఐచ్చిక పెట్టె(డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్) లో ఒక ఐచ్చికాన్ని ఎన్నుకోవాలి.
ఉదాహరణకి నాకు 2000 ల కంటే ముందు విడుదలైన ఇళయరాజా పాటలు కావాలి, మొదటి ఐచ్చికం కింద ఆర్టిస్ట్ ని ఎన్నుకోవాలి ఆ తరువాత క్రిందకు జారే ఐచ్చిక పెట్టెలో "కంటైన్స్" అనే ఐచ్చికం("ఈజ్" కూడా ఈ సందర్భంలో అదే పని చేస్తుంది) ఎన్నుకున్న తరువాత టెక్స్ట్ బాక్స్ లో ఇళయరాజా పేరు రాయాలి. ఈ నిబంధన ప్రకారం ఇళయరాజ అన్ని పాటలు ఎన్నుకోబడుతాయి కాని నాకు 2000ల కంటే ముందు పాటలు మాత్రమే కావాలి కనుక ఇంకో నిబంధన విధించాలి. టెక్స్ట్ బాక్స్ పక్కనున్న + గుర్తుని నొక్కితే పైన పేర్కొన్న మూడు పెట్టెలు ఇంకో సెట్ కనిపిస్తాయి. వాటిల్ల్లో ఈ సారి వరుసగా ఇయర్, ఈజ్ లెస్ దాన్, 2000 ఎన్నుకొని ఓకె నొక్కితే కొత్త ప్లే లిస్టు తయారు చేయబడి అందులో నాకు కావాల్సిన పాటలు వస్తాయి.
మీరు ఇంకా వేరే విధంగా ఈ ఫీల్డ్ లని వాడితే సూచించగలరు.
సాధారణంగా పాటలను పొందుపరిచేది తరువాత సులభంగా తిరిగి పొందేటందుకే, ఈ తిరిగిపొందటమనేది ఏదేని అంశం ఆధారంగా తీసుకొని కావచ్చు(ఉదా: కళాకారుడు, చలనచిత్రం పేరు, విడుదలైన సంవత్సరం....... మొ.), ఈ అంశాల ద్వారా పొందాలనుకున్నప్పుడు ఈ వివరాలన్ని ముందుగా నిక్షిప్తం చేసుకోవాలి. కాస్త క్లిష్టంగా అర్థం కాకుండా ఉందా, విపులంగా చెబుతా. ప్రతి ఎమ్పీ౩ పాట ఒక తోకను కలిగి ఉంటుంది, ఇదీ కేవలం సమాచారాన్ని నిక్షిప్తం చేసుకుంటుంది దీన్నే టాగ్ అంటారు. ఈ తోకలలోని సమాచారాన్ని చదివే ఐట్యూన్స్ పాటలని వెదుకుతుంది. కాబట్టి ఐట్యూన్స్ నిర్వహణకి ఈ తోకల నిర్వహణే కీలకం, ఈ తోకలని ఐట్యూన్స్ లో ఎలా కూర్చుకోవచ్చో చూద్దాం(ఈ పేరా అర్థం కాకపోతే అస్సలు చింతించాల్సిన పని లేదు. ముందుకు సాగిపోండి).
ఐట్యూన్స్ నిర్వహణ కోసం నాకై నేను కొన్ని నియమాలు పెట్టుకొని ఒక ప్రమాణాన్ని తయారుచేసుకున్నాను, ఇది ఎవరి అవసరాలకు తగ్గట్టు వారు సవరించుకుంటే బాగుంటుంది.
టాగ్।లో పాటకి సాధారణంగా కింది ఫీల్డ్స్ ఉంటాయి,
నేమ్ : పాట పేరు
ఆర్టిస్ట్ : సాధారణంగా మన పాటలన్ని సంగీత దర్శకుడి కేంద్రంగా ఉంటాయి కనుక ఈ విభాగంలో సంగీత దర్శకుడి పేరు
ఆల్బమ్ ఆర్టిస్టు : ఇక్కడ పాట పాడిన వారి పేరు రాయడం ముదావహం. (ఈ ఫీల్డు పూరించడం వలన కొన్ని సమస్యలున్నాయి, ఐట్యూన్స్ సాధారణంగా ఆల్బమ్ ఆర్టిస్ట్ అధారితంగా పాటలని గుంపులుగా విడదీస్తుంది దానివల్ల ఒక సినిమా పాటలే ఒక్కో పాటకి ఒకో ఆర్ట్ వర్కుతో కనిపిస్తుంది ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇలా. ఇంకో సమస్య ఏంటంటే ఎంతమంది ఆల్బమ్ ఆర్టిస్టులుంటే అన్ని సార్లు ఐపాడులోకి మొత్తం పాటలు సింక్ అవుతాయి. అంటే సప్తపది సినిమాలో ఆరు పాటలు ఆరుగురు పాడారనుకుంటే, ఐపాడులో సింక్ చేసినపుడు ఆరు పాటలు ఆరుసార్లు కాపీ అవుతాయి. అందుకే ఈ ఫీల్డు వదిలేయడం మంచిది.)
ఇయర్ : సినిమా విడుదలైన సంవత్సరం
ఆల్బమ్ : సినిమా పేరు
గ్రూపింగ్ : ఈ ఫీల్డు సాధారణ బ్లాగు టపాలకుండే లేబుళ్ల మాదిరిగా పని చేస్తుంది, మీకు పాటకు సంబంధించి ఏదైనా లేబుళ్ ఇస్తే బాగుంటుందనుకుంటే ఈ ఫీల్డ్ వాడుకోవచ్చు (ఉదా: హీరో/హీరోయిన్ పేరు, పాట పాడిన వారి పేరు ....), కామాతో వేరు చేస్తు ఎన్నైనా రాసుకోవచ్చు.
కంపోజర్ : ఈ ఫీల్డుని నేను రచయిత కోసం కేటాయించా కాని సమయాభావం మరియు ఇతరత్రా కారణాల వల్ల ఈ ఫీల్డుకి అన్యాయం జరుగుతోంది.
కామెంట్స్ : ఖాళీగా వదిలే ఫీల్డు, దేనికి వాడాలో నిర్ణయించలేదు,
జెనర్/జాన్రా (ఏదో ఒకటి) : మన పాటలు సినిమాలకి జ్../... నిర్ణయించలేని నిస్సాహయత ఈ ఫీల్డుని భాషకోసం వాడుకోరా అంది, అందుకే హిందీ, ఇంగ్లీషు పాటలకి ఆ పేరు రాస్తా, ఏదీ రాయకపోతే తెలుగని అర్థం.
ట్రాకు నం., డిస్కు నం,. బిపిఎమ్ : ఇలాంటి వాటిల్లో ఏమి రాయొద్దని మా నాన్న గారు చెప్పారండి :).
లిరిక్స్ : పాట సాహిత్యం ఎక్కడైనా అంతర్జాలంలో దొరికితే (తెలుగులో మాత్రమే) ఇక్కడ దాచేస్తాను. ఐపాడులో తెలుగు యూనికోడు సరిగా కనిపిస్తుందో లేదో తెలీదు కాని ఐఫోనులో మాత్రం సరిగా కనిపించదు కానీ భవిష్యత్ మీద నమ్మకంతో సాహిత్యం భద్రపరుస్తున్నా.
ఆర్ట్ వర్క్ : సినిమాకు సంబంధించి ఒక పోస్టరు.
ఇంకా చాలా ఉంటాయి కానీ ఇవి ముఖ్యమైనవి.
ఇక లోపలికేళితే(ఏ లోపలికి అనే లాంటి కొచ్చెన్లకు జాగలేదు), పాటలని దిగుమతి చేసుకోగానే పక్క చిత్రంలో చూపినట్టు "డేట్ ఆడెడ్" ఆధారంగా సార్ట్ చేసుకోవాలి, ఇప్పుడే దిగుమతి అయిన పాటలు ఒక దగ్గర, అన్నింటి కంటే ముందు చూపిస్తుంది.

దిగుమతి చేసుకున్న అన్ని పాటలని ఎంచుకొని, రైట్ క్లిక్ చేసి 'గెట్ ఇన్ఫో' ని ఎంచుకోవాలి. అప్పడు కింది విండో లాంటిదొకటి వస్తుంది,(గమనిక: మొదటిసారి ఇంకో చిన్న పాప్ అప్ విండో, మల్టిపుల్ ఫైల్స్ ఎడిట్ చేయాలా అని అడుగుతుంది, ఎస్ అని క్లిక్ చేయండి).
దాదాపు ఇంతకుముందు చెప్పిన ఫీల్డులన్నీ ఇక్కడ గమనించవచ్చు. ఇది 'సప్తపది' సినిమా పాటల ఇన్ఫో విండో, ఫీల్డులు పైన చెప్పిన విధంగా కాని మీకు నచ్చిన విధంగా కాని నింపవచ్చు.ఒకటికి మించి పాటలు ఎంచుకున్నందున ఇందులో నేమ్ అనే ఫీల్డు కనిపించదు. ఆర్టువర్క్ ఫీల్డ్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఇంకో విండో తెరుచుకోని మీ కంప్యూటరు నుండి ఫోటోని ఎంచుకోమంటుంది.
"It's That Simple".
ఇంకా దేనికోసం ఆగారు, ఓకే నొక్కండి.
గ్రూపింగు ఫీల్డు బ్లాగుల లేబుళ్ల ఫీల్డు మాదిరిగా పనిచేస్తుందనుకున్నాం కదా అదెలాగో చూద్దం. ఐట్యూన్స్ లో ఒక మంచి పరికరం "స్మార్ట్ ప్లే లిస్ట్". దీనికోసం file -> New smart play list ని క్లిక్ చేయగానే ఒక కొత్త విండో వస్తుంది అందులో మన స్మార్ట్ ప్లే లిస్టు కి నిబంధనల్ని ఎంచుకోవాలి. ఇందులో మొదటి ఫీల్డులో దాదాపుగా ఇరవై-ముప్పై వివిధ రకాల ఐచ్చికాలుంటాయి. వీటిల్లో ఇంత క్రితం మనంరాసినవే కాక ఇంకా చాలా ఉంటాయి (ఉదా: ప్లే కౌంట్, రేటింగ్, డేట్ ఆడెడ్.......మొ.) అందులో నుండి ఒకటి ఎన్నుకున్న తరువాత ఒక క్రిందకు జారే ఐచ్చిక పెట్టె(డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్) లో ఒక ఐచ్చికాన్ని ఎన్నుకోవాలి.
ఉదాహరణకి నాకు 2000 ల కంటే ముందు విడుదలైన ఇళయరాజా పాటలు కావాలి, మొదటి ఐచ్చికం కింద ఆర్టిస్ట్ ని ఎన్నుకోవాలి ఆ తరువాత క్రిందకు జారే ఐచ్చిక పెట్టెలో "కంటైన్స్" అనే ఐచ్చికం("ఈజ్" కూడా ఈ సందర్భంలో అదే పని చేస్తుంది) ఎన్నుకున్న తరువాత టెక్స్ట్ బాక్స్ లో ఇళయరాజా పేరు రాయాలి. ఈ నిబంధన ప్రకారం ఇళయరాజ అన్ని పాటలు ఎన్నుకోబడుతాయి కాని నాకు 2000ల కంటే ముందు పాటలు మాత్రమే కావాలి కనుక ఇంకో నిబంధన విధించాలి. టెక్స్ట్ బాక్స్ పక్కనున్న + గుర్తుని నొక్కితే పైన పేర్కొన్న మూడు పెట్టెలు ఇంకో సెట్ కనిపిస్తాయి. వాటిల్ల్లో ఈ సారి వరుసగా ఇయర్, ఈజ్ లెస్ దాన్, 2000 ఎన్నుకొని ఓకె నొక్కితే కొత్త ప్లే లిస్టు తయారు చేయబడి అందులో నాకు కావాల్సిన పాటలు వస్తాయి.
మీరు ఇంకా వేరే విధంగా ఈ ఫీల్డ్ లని వాడితే సూచించగలరు.
3 comments:
నేను ఆసాంతం చదివాను కానీ మామూలు MP3 songa itunes గా ఎలా convert చేయాలో తెలియలేదు. నేను Motorola v3i కొని 2సం.లు అయ్యింది కానీ అందులో itunes ఎలా కాపీ చేయాలో తెలియలేదు. ఒకసారి కంప్యూటర్ సెంటర్లో చేయిస్తే 40 songs ki 100/- తీసుకున్నడు. అవి memory card format చేసినప్పుడు పోయాయి. ఆ తరువాత ఆ option మరి వాడలేదు. ఇప్పుడు సొంతంగా పిసి వున్నా ఎలా చేయాలో తెలియలేదు. దయచేసి చెప్తారా?
>> "ప్రతి ఎమ్పీ౩ పాట ఒక తోకను కలిగి ఉంటుంది"
యధాలాపంగా రాసినా హాస్యం కుమ్మేస్తారు బాబోయ్.
నాకిక ఏ ఎమ్పీ-3 చూసినా దాని తోక కనిపించేస్తుంది - అవతార్ Na'viల మాదిరిగా.
@అబ్రకదబ్ర గారు,
మీ అభినందనలకు ధన్యవాదలు, నాకు అవతార్ సినిమా చూసినంత సేపు అలాంటి ఒక విశిష్ట యూ ఎస్ బి పోర్ట్ ఒకటి మన కంప్యూటర్లకి కూడా ఉంటే బాగుంటుందనిపించింది.:)
@కెక్యూబ్ వర్మ గారు,
ఎమ్పీ౩ని ఐట్యూన్స్ గా మార్చడం అనేదేమి ఉండదు, ఐట్యూన్స్।లో ఉండేవి కూడా ఎమ్పీ౩ పాటలే. కేవలం ఎమ్పీ౩లని ఒక దగ్గర కూర్చి వాటి టాగ్ లని చదివి గ్రాఫికల్ గా చూపిస్తుంచి. ఒకవేళ మీ ప్రశ్న ఐట్యూన్స్।లోకి ఎలా కాపీ చేయడం అనేదైతే దానికి రెండు పద్దతులు,
౧. పాటని రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ ఐట్యున్స్ అని సెలెక్ట్ చేయ్డం.
౨. ఐట్యూన్స్ కెళ్లి ఫైల్ -> ఆడ్ టూ లైబ్రరీ అని నొక్కాలి.
ఒక సారి ఐట్యూన్స్।లోకి తెచ్చాక ఎలా వాడలో ముందుగా చెప్పాను.
ఇక మీ v3i విషయానికొస్తే, ఆ ఫోను విడుదలయ్యి మూడు సంవత్సరాల పైనే అయ్యింది, అప్పటి ఐట్యూన్స్ ఆ ఫోన్ ని సపోర్ట్ చేసింది ఇప్పటికీ చేస్తుందనే విశ్వసిస్తున్నా. మీ పిసికి కనెక్ట్ చేసినప్పుడు ఐట్యూన్స్ లో ఫోను డిటెక్ట్ చేస్తుందా, లేదా మీరెప్పుడూ ప్రయత్నించలేదా.
ఒక వేళ మీరు ప్రయత్నించి ఏదేని సమస్య ఎదురైతే తెలియజేయండి నా వంతు సహాయం చేయగలను.
Post a Comment