మన ఉప్పిగాడు అందర్లాగే ఒకరోజు పుట్టిండు, గదెప్పుడు అనే దాని మీద ఎప్పుడూ బొందలు తవ్వుకుంట ఉండే సర్కారు జీతగాళ్ళు(పురావస్తు శాస్త్రవేత్తలు) కిందామీద పడ్తున్నరు, ఆల్లే గంత ఇది అయితున్నరు కాబట్టి మనం దాని జోళికెల్లద్దు. ఇగ వాడెక్కడ పుట్టిండో తెలుసుకునే ముందు జర ఆని అవ్వ, అయ్యలెవలో తెల్సుకోవాలే గదా. ఆని అయ్య పేరు నిప్పు కుటుంబ రావు, అమ్మ పేరేమో రామగిరి సంతాన లచ్చి. అదేంది మద్దెలచెర్వు సూరి, వాళ్ల ఇంటామే పేర్ల లాగ ఇంటి పేర్లు కలవలేదేంది అన్పించిందా, జర చెప్పే దాంక ఆగరాదు. మన కుటుంబరావు ఇంటిపేరు బీ రామగిరే కాకపోతే కుటుంబరావు ఎక్కడ ఉంటే అక్కడ పొగొత్తది(సిన్నప్పుడు కరీం బీడీ, తర్వాత విజయ్ సిగరెట్లు తాగేటోడు, ఇప్పుడు గోల్డ్।ఫేక్ కింగ్ సైజైతే తప్ప ముట్టడు), ఆని సోపతిగాళ్లు పొగకు కారణమైన నిప్పుని ఆని ఇంటి పేరు కింద మార్చి పిలిశి పిలిశి పిలిశి పిలిశి పిలిశి(అసలే ఏండ్లు పూండ్ల కేండ్లి పిలవ వడితిరి ఇంకో పది సార్ల 'పిలిశి' అని రాద్దామనుకున్నా కని ఇంకా రాత్తే కొట్టేటట్టున్నరు) అదే ఆళ్ళ ఇంటి పేరయ్యింది. ఆ జంట పేరు కుటుంబ రావు, సంతాన లచ్చే అయినా మన నిప్పుకి గొప్ప దేశభక్తి ఉండవట్టి ఇద్దరి తోనే ఆపేశిండు.
గా ఇద్దరిల పెద్దోడే మన ఉప్పిగాడు ఉరఫ్ ఉపేంద్ర, ఈడు పేరుకు తగ్గట్టే మన కన్నడ ఉప్పిగానికి సెకండరీ ఫ్యాను. ప్రైమరీ ఫేవరేటు మన తెలుగుల్నే ఉన్నడులే(గది సస్పెన్స్, ఎవళ్ళ ఊహలకు ఆళ్ళనే ఒదిలేత్తాన). ఇగ సరింగా కతలకు పోతే, మన ఉప్పి గాని ఊరు రామన్నపేట. దీన్నే ఆడి జిందగీల ఎప్పటికైనా ఉప్పన్నపేట అని మారుత్తరని ఎదురు సూత్తన్నడు. ఈడు పుట్టిన కాడినుండి 'కిక్కు' సైన్మాల రవితేజ టైపు, కాని ఆనికి ఈనికి కొద్దిగ ఫరక్ ఉన్నది. గా సైన్మాల వాడేం జేశిన హీరో కాబట్టి ఆనికి కిక్కు అత్తది, పాపం మనోడు హీరో కాకపాయే ఈడేం జేశినా ఈనికి 'ఎక్కు' అత్తది (తప్పుద్దా 'ఎక్కు' అంటే ఏంటిదో చెప్పలె గదా, గిది ఇంగిలిపీసు ముక్క ఎక్ అంటే హెడ్ ఏక్, హ్యాండ్ ఏక్ గట్లన్నమాట. గిట్ల రాయద్దని ఎవలన్న అంటే మన తెల్గూ సైన్మా పాటల్ రాశేటోళ్ళ దగ్గరికి తోలుత, మరి లేక పోతే గ్రేటాది.. గ్రేటుడు, స్నేకాది.. స్నేకుడు, ఉన్నప్పుడు ఈ ఎక్కు గూడ ఉంటది). గా కిక్కు సైన్మా అచ్చినప్పుడైతే సైన్మాల హీరో ఆని లాగనే జేశుడు సూశి సంతోశాన్ని ఆపుకోలేక ఏడిత్తే రామన్నపేటకు ఉన్న మూడు చెర్వులు నిండి రైతులు ఆస్మాన్ దిక్కు సూడకుండనే రెండు పంటలు తీశిండ్రు, పాపం అప్పటికీ మనోని పేరు ఆ ఊరికి పెట్టలే. మామూలుగా ఎవళ్ళన్నా ఒక పని జేసుట్ల తోపులైతే ఆల్లకి ఉగ్గుపాలతో నేర్సుకున్నడంటరు, కాని మన ఉప్పిగాడు తింగరి పనులు జేయడం ఉగ్గుపాలు తాగకముందే నేర్సుకున్నడు. ఈనికి పుట్టుడు పుట్టుడే ఏదో ఒక తింగరి పని సేయాలనిపించింది.
పుట్టీపుట్టగానే ఈడికి ఆ డాక్టరు గాడిని ఎదవను జేద్దమనిపించి పుట్టగానే ఏడ్వలేదు, పాపం ఆ డాక్టరు జరంత పరేషాన్ అయినా ఓపిక వట్టి ఓ రెండు నిమిషాలు సూశిండు, ఈడు పెద్ద జగత్ కంత్రీ అని ఫిక్సయిపోయి ఈడు కండ్లు మూసుకొనే ఆ డాక్టర్ని దొంగసూపులు సూత్తాండు. ఆ డాక్టర్కి పరేషాన్ పెరిగి మొఖంలనే ౩డి సైన్మా సూపెడ్తాంటే ఈడు కిస్స కిస్స నవ్వుకుంటాండు, ఇంక ఆ డాక్టరు ఈడు ఉన్నడా పోయిండా అని కాల్లట్టుకొని పైకి లేపి ఉపుతాండు, పోరడు ఏడ్వక పోతడా అని. ఆడేమో ఉయ్యాల ఊగుడు మంచిగున్నది అనుకుంటా ఆని అయ్యని రోజు కెన్నిసార్ల ఉయ్యాల ఎక్కియ్యమనాలే అని లెక్కలేస్కుంటున్నడు. ఇప్పటికైనా ఎడిత్తే పోయేదిగా, ఊహూ అట్టా ఏడిత్తే మన ఉప్పిగాడెందుకైతడు. సాధారణంగా ఒకడ్ని బిస్కట్ చేయడానికి ఇంకొకడేవడైనా సుమో పెడ్తడు కాని మన ఉప్పి గాడు పెట్రోలు పోయించుకొనొచ్చి మరీ సెల్ఫ్ సుమో పెట్టుకోవటంలో దిట్ట.ఆ డాక్టర్కి పరేషాన్ ఎక్కువై ఎన్నుల ఓక్కటి ఇద్దామని చేయి పైకి ఎత్తిండు, పరేషాన్ల సూసుకోక పోయేసరికి సెలైను సీసాకెట్టిన సూదొకటి డాక్టరు చెయ్యితో బాటొచ్చి అంటీ అంటకుండా మనోడి ఈపు మీద సంతకం చేశి పోయింది. అది ఆడి జిందగీ మొత్తం ఆని ఈపు మీద పర్మనెంటు సంతకమైంది.
గిసోంటి సెల్ఫ్ సుమో పనులు శానా చేశిండు, అప్పుడెప్పుడో టివిల అచ్చిన ఏదో భారతం సైన్మా సూశి ఈడే భీముడనుకొని ఫిక్సయ్యిండు, ఐనోడు ఊకుంటడా దాన్ని ఎట్లైనా అందరితోని నిజమని ఒప్పియ్యాలే అని రకరకాల ప్రయత్నాలు జేత్తన్నప్పుడు టివిల ఒక అడ్వర్టైజ్ మెంటు సూశిండు అదే "మహరాజ మిక్సి" ఆ మిక్సీ వోడు ఎఫెక్టులు గట్టిగుండాల్నని గా మిక్సి కొండల్నే పిండి చేశినట్టు సూపిచ్చిండు. గది సూడంగనే ఈని సుమో షెడ్డుకు పోయి టైర్లల్ల గాలి కొట్టిచ్చుకొనొచ్చింది. ఈడు ఎంఠనే పోయి ఈల్ల మిక్సీకి ఓ జార్ పెట్టి సిచ్చేశి రడీగున్నడు, ఆడి ఎధవ ఐడియా ఏంటంటే కొండల్ని బండల్నీ పిండి జేశిన మిక్సీని చేయి పెట్టి ఆపాలె అని. గట్టిగ బ్లేడును పట్టుకున్నడు, ఇంగ గ్రైండరు మీద కట్క నొక్కడమే. కరెక్టుగ ఆడు కట్క నొక్కిండు అది పది సుట్లు తిరిగిందో లేదో కరెంటు పోయింది, గా పది సుట్లల్లనే ఈని ఏలు తెగి అర లీటరు రగతం మురిక్కాలవలకు పోయింది.
ఇంగ గిట్ల శెప్పుకుంటపో మస్త్ అయితది మల్లోసారికి శెప్పుకుందాం.

10 comments:
ఉప్పిగాడు రిటర్న్స్.
>> "మన ఉప్పిగాడు అందర్లాగే ఒకరోజు పుట్టిండు"
ఎత్తుగడే అదిరింది :-) మూడో పేరా చదువుతుంటే ఆ సన్నివేశం కళ్లలో మెదిలి నవ్వాగలేదు. You have a great style friend. విషయం ఏమీ లేకున్నా విసుగు రాకుందా పేజీలు రాసేసి చదివించగలిగే కళుంది. పదును పెట్టండి.
ఫోటోగ్రఫీలో కూడా ప్రవేశముందా? పక్కన బొమ్మ బాగుంది. ఎంత పెద్ద జూమ్ లెన్స్? (shallow DoF gave it away)
@అబ్రకదబ్ర గారు,
ఫోటోగ్రఫీలో కొద్దిగా ప్రవేశముంది, నా దగ్గర Canon 450D + 18-200mm lens కెమెరా ఉంది. నా మిగతా ఫోటోలు చూడాలంటే కింది లంకెలో చూడొచ్చు.
picasaweb.google.com/thopucherla.s
పనిలో పనిగా అది ఏం పువ్వో కనిపెట్టగలరేమో ప్రయత్నించండి.
చాలా బాగా రాసారండి..బాగుంది.. కాకపోతే కూపస్త మండూకం లా మా గోదావరి చుటుపక్కలకు తప్ప ఇంకెక్కడికీ ఎక్కువగా వెళ్ళలేదేమో నాకు వేరే యాస అంత తొందరగా అర్ధం కాదు.. మెల్లి మెల్లిగా చదివితే చాలా బాగుంది :))
ఫైర్‌వర్క్స్ ఫోటోలు బాగున్నాయి. How did you manage to avoid spill light?
సూర్యాస్తమయంవి కూడా బాగున్నై.
ఆ వెస్పా చూస్తే మా 1954 మోడల్ వెస్పా గుర్తొచ్చింది. అదే రంగు కూడా! ఇప్పటికీ ఝామ్మని నడుస్తుంది. అప్పట్లో ఇటలీ నుండి ఓడలో వచ్చిందట. మా ఊర్లో మొట్టమొదటి స్కూటర్; ఇప్పడున్న వాటన్నిట్లో వృద్ధ స్కూటర్ :-)
@నేస్తం గారు,
ముందుగా ధన్యవాదాలు, మీరు చెబితే నమ్మరు కాని 'వార్త' పేపర్లో అనుకుంటా, 'యాకూబ్ కతలు' (పేరు సరిగా గుర్తు లేదు) తెలంగాణ యాసతో కథలు రాసేవారు, ఆ కాలంలో ఒక్కో పదాన్ని కూడదీసుకొని చదివే వాడిని. చాలా బాగుండేవి అవి.
@అబ్రకదబ్ర గారు,
మీకు నచ్చినందుకు సంతోషం, ఫైర్।వర్క్స్ ఫోటోల్లో F number పెద్దదిగా పెడితే చుట్టుపక్కల కాంతిని తరిమేయవచ్చు, నేను f22 వాడినట్టున్నాను. చలిగా ఉండి(చేతులు చల్లగా కొచెం వణుకుతామన్నాయి), ట్రైపాడు లేక చాలా ఫోటోలు బాగా రాలేదు(నేను కొనాలనుకొని బద్దకంతో కొనని ఉపకరణాలలో ట్రైపాడ్ మొదటిది)
మీ వెస్పా కూడా ఇక్కడున్న వెస్పా సోదరుడేమో, మా నాన్నకి కూడా ఒక వెస్పా ఉండేది, పాతదే కాని అంత పాతది కాదు.
కూడదీసుకుని చదవటం ఎందుకు? మీకు తెలంగాణ యాస మీద మంచి పట్టే ఉంది కదా.
ఇంతకీ 'సుమో పెట్టటం' ఏంటి? ఈ ప్రయోగం మొదటిసారి వింటున్నాను. మీ వరంగల్ (వరంగల్లే కదా?) స్థానిక స్లాంగా?
ఆ పువ్వేంటో వెలగలేదు. చెప్పేద్దురూ. నేను చరిత్రలో స్ట్రాంగే కానీ బోటనీ, బయాలజీ, జువాలజీల్లో బహు వీకు :-)
@అబ్రకదబ్ర
అప్పట్లో తెలంగాణా యాసలో ఆ కథలు చదవటమే మొదటిసారి. యాసతో ప్రత్యేకమైన అనుభవమేమీ లేదు మరీ ఏదైనా పల్లెటూరిలో వినడం తప్ప చదవటం అలవాటు లేదు కదా, పదాన్ని పూర్తిగా చదవకముందే మెదడు ఒక పదాన్ని అనుకోవడం నిజానికి అక్కడ యాసలో ఉన్న పదం ఉండటం దాన్ని ఒకసారి చూసుకొని ముందుకెళ్లే సరికి ఇంకో పదం వెయిటింగు.
ఇక సుమో విషయానికొస్తే, ఇది ఎక్కడి స్లాంగూ కాదు. 'అతడు' సినిమాలో బ్రహ్మాజీ "కాలువగట్టు దగ్గర రెండు సుమోలు, జాతర దగ్గర ఒక సుమో....." అని ఒక డైలాగ్ చెబుతాడు కదా దాన్నుండి మా స్నేహితుల మధ్య ఉద్బవించిన జాతీయం. సాధారణంగా నలుగురం కలిసి ఒకడ్ని కామెంటు చేసినప్పుడు "ఆనికి సుమో పెట్టిండ్రు" అని అంటం.
అప్పుడప్పుడు ఎవరు కామెంటక పోయినా తనంతటతానుగా ఎవరైనా ఫూల్ అయితే వానికి ఎవడు సుమో పెట్టకపోయినా వాడే ఒకటి పెట్టుకున్నడు కాబట్టి అది సెల్ఫ్ సుమో, సెల్ఫ్ సుమో తీవ్రతను పెంచాలంటే పెట్రోల్ కొట్టించుకొని మరీ సెల్ఫ్ సుమో పెట్టుకోవటం లాంటివి.
ఇదీ సుమో కథ. ఫక్తు లోకల్ జాతీయమే కాని కొంత మందైనా వాడుతున్నరేమో అని రాసేసా!
Hey sreekanth,
nice to see u here ..
what is the aim of this blog?
@mahee
NO aims, just I write
Post a Comment