Monday, March 29, 2010

తప్పుల తడకలతో నిండిపోతున్న వార్తాపత్రికలు

ఈ మధ్య ప్రధాన వార్తాపత్రికలలో అచ్చుతప్పులు సర్వసాధారణమైపోతున్నాయి. నిరంతరం అనేక సమస్యలతో సతమతమయ్యే జనం ఇలాంటి వాటిని గుర్తించినా చేసేదేమీ లేక సర్దుకొని పోతున్నారు. దిన దిన ప్రవృద్దమానంగా ఎదగాలన్న నానుడిని నరనరాన జీర్ణిచుకున్న ఈ నాలుగో స్థంబం 'విశ్వసనీయ వర్గాలు' 'జనం అబిప్రాయపడుతున్నారు' 'పలువురి అబిప్రాయం' అన్న ఒక తోకనెట్టేసుకొని ఎవడి కపాలానికి తోచింది వాడు రాసేసుకోవడం మొదలుపెట్టారు. వీటన్నిటినీ తలదన్నేలా ఈ రోజు రెండు ప్రముఖ దినపత్రికలు 'ఈనాడు' 'సాక్షి' క్రీడా పేజీలో ఫార్ములా వన్ రేసు గూర్చి వారి ఇష్టానుసారం రాసేసుకున్నారు. 
నిన్న (ఆదివారం, 28-04-10)  ఆస్ట్రేలియాలో ప్రస్తుత సీజన్లో రెండో రేసు జరిగింది. సాధారణంగా ఈనాడు ఫార్ములా వన్ వార్తలను పెద్దగా ప్రచురించదు. ఎప్పుడో కొద్ది సంవత్సరాల క్రితం భారతదేశం నుండి నారాయణ కార్తికేయన్ పాల్గొన్నప్పుడు మాత్రం కొద్దిగా ప్రాధాన్యతనిచ్చేది. సాక్షి పత్రిక మాత్రం మొదటినుండి ఫార్ములా వన్ వార్తలను ప్రచురించేది అప్పటినుండి సాక్షి పత్రికంతకాకపోయినా ఈనాడు ఒక నాలుగయిదు లైన్ల వార్తని ప్రచురించేది. ఈ రోజు నిన్న జరిగిన రేసు గురించి రెండు పత్రికలు తప్పుగా ప్రచురించాయి. 
ఈనాడులో డ్రైవర్ల పేర్లను రాబర్ట్ క్యూబిక, లుజి(సాక్షిలో లూజీ అని) అని ప్రచురించారు నిజానికి వారి పేర్లు రాబర్ట్ క్యూబిత్స, లియుజీ అని పలకాలి, ఇంకా ఇలాంటి తప్పులు అనేక సార్లు దొర్లాయి. సాంకేతిక పరిఙానం ప్రంపచాన్నే ఒక క్లిక్ దూరంలో నిలిపిన ఈ యుగంలో ఇంకా ఇలాంటి తప్పులని ఎన్నాళ్ళు భరించాలో. ఇవి టుమ్రీ తప్పులే కదా అని అనిపించవచ్చు కానీ, రేసు గురించి వివరిస్తూ 'సెబాస్టియన్ వెటల్ ' తొమ్మిదో ల్యాపులో నిష్క్రమించాడని ఈనాడులో, ఇరవై ఆరవ లాపులో వైదొలిగాడని సాక్షిలో పరస్పర విరుద్ద కథనాలు ప్రచురించారు. నిజానికి వెటల్ ఇరవయ్యవ లాపులో నిష్క్రమించాడు. 
సాక్షి ఇంకో అడుగు ముందుకేసి ఒక ఫోటొని ప్రచురించారు దానికి క్యాప్షన్।గా "ఆరంభంలోనే ఝలక్: తొలి ల్యాప్ లోనే అదుపు తప్పిన కార్లు" అని ప్రచురించేసారు, నిజానికి ఆ ఫోటోలో ఫెరారీ డ్రైవరు ఫెర్నాండో అలెన్సో కారు గతి తప్పి వ్యతిరేక దిశలో ఉండగా మిగతా కార్లన్ని సరైన దిశలో పోతున్నాయి. నిజానికి కారు వ్యతిరేక దిశలోకి తిరగి నిలిచిపోవడం  ఆ సంఘటనలో మినహా ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఆ ప్రమాదం వలన అలన్సోకి ఝలక్ కూడా తగల్లేదనొచ్చు ఎందుకంటే అతను నాలుగో స్థానం సంపాదించాడు కనుక. 
ఇలా తప్పుల తడకలతో ప్రచురించే బదులు వాటిని ఆపేయాలని వాళ్ళకనిపిస్తే బాగుండు.


6 comments:

కొత్త పాళీ said...

బాగుంది మీ రంధ్రాన్వేషణ. అప్పుడెప్పుడో స్పానిష్ టెన్నిస్ క్రీడాకారుడు రాల్ రామిరెజ్ అనే అతని పేరుని రాళ్ళ రామిరెడ్డి అని రాశాయిట మన పత్రికలు. ఆ సాంప్రదాయమే ఇప్పుడూ కొనసాగుతున్నట్టుంది.

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ said...

ఇవే కాదు.ఆత్మహత్యలు,కిడ్నాపులు లాంటి విషయాలలో కూడా ఈనాడు వొకలా,సాక్షి యింకోలా వార్తలు ప్రచురిస్తాయి.

రాళ్ళ రామిరెడ్డి@ రాల్ రామిరెజ్ .. :-)

కన్నగాడు said...

@కొత్తపాళి, బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ గారు,
మీ స్పందనకు ధన్యవాదాలు.

రాల్ రామిరెజ్ :)

thinker said...

meeeru porabadutunnaaru, ee tappulanni kevalam news content lo maatrame, cinema gossips and advertise ments lo choodandi, appu tachchu lu lEkundaa vishayam raastaaru

అబ్రకదబ్ర said...

మీ కొత్త బ్యాగ్రౌండ్/ఫోర్‌గ్రౌండ్ జత బాలేదు. కళ్లు లాగుతున్నాయి.

కన్నగాడు said...

@అబ్రకదబ్ర గారు,
సింపుల్ మూమెంటే కదా! మార్చేసా,

Google Analytics Alternative