Thursday, April 8, 2010

ఐఫోన్లో తెలుగు


మొబైలు విపణిలో ఐఫోను సృష్టించిన విప్లవాత్మకమైన మార్పుల గురించి తెలియంది కాదు. ఈ రోజు అనగా 08/04/2010 నాడు ఐఫోను కోసం కొత్త ఆపరేటింగు సిస్టం ఐఫోను ఓ.ఎస్ 4.0ని ప్రదర్శించింది. అందులో వ్యాపార అవసరాలకు అనుగునంగా మల్టీటాస్కింగ్ లాంటి అనేక కొత్త పనిముట్లను అమర్చింది. కాని అన్నింటి కంటే విశేషంగా ఆకర్షించింది మాత్ర్మ్ ఐఫోనులో తెలుగు ఫాంట్లను పొందుపరచడం. ఈ కొత్త ఓ.ఎస్. వేసవి విడుదలకు సిద్దమవుతున్నది. డెవలపర్లకి మాత్రం నేటి నుంచే 4.0 బీటా అందుబాటులోకి వచ్చింది. కొత్త ఓ.ఎస్ లో ఇంకా చాలా విశేషాలున్నా అవి అంతర్జాలంలో ఏ మూలనైనా దొరుకుతాయి కనుక ఇక్కడ ప్రస్తావించట్లేదు. ఎడమ వైపు ఉన్న చిత్రం నా ఫోన్లో నా బ్లాగు, ఆ చిత్రంలో కింద కనిపిస్తున్నది మల్టీటాస్కింగ్ డాష్ బోర్డు. (హోమ్ బటన్।ను రెండు సార్లు నొక్కితే పైకి వస్తుంది)

11 comments:

Badri said...

Thanks a lot..
manchi news chepparu..

Inka may eppudostada ani waiting ippudu

కన్నగాడు said...

@బద్రి గారు,

మేలో కాదు, బహుషా జూన్లో ఉండొచ్చు.

శ్రీ said...

బ్లాక్ బెర్రీ లో కూడా వస్తుందా?

డా.ఇస్మాయిల్ said...

wow! i was waiting fot this for a long time...

Malakpet Rowdy said...

Cool, this is good news!

cbrao said...

తెలుగు భాషాభిమానులకు శుభవార్త.

కన్నగాడు said...

@శ్రీ గారు,
బ్లాక్ బెర్రీ గురించి తెలియదండీ, కానీ పోటీ ప్రంపంచం కదా ఎక్కువ సమయం పట్టకపోవచ్చు.
@డా.ఇస్మాయిల్, మలక్।పేట్ రౌడీ గారు,
నేను చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నాను, నేనింకా ఈ సారి భారతీయభాషలకు అనుగుణమైన కీబోర్డు కూడా సమకూర్చుతాడనుకున్నా. :(
@సి.బి.రావు గారు,
నిజంగా శుభవార్తే!

కొత్త పాళీ said...

super.
ఈ కొత్త OS ఎక్కడ సంపాయించాలో కూడా చెప్పి పుణ్యం కట్టుకోండి, నాలాంటి అటెక్కీలకి (అనగా టెకీలు కాణివాళ్ళకి) పనికొస్తుంది

Rajesh Devabhaktuni said...

ఆహ...! చక్కని సమాచారం....ఒక ఆరు నెలల క్రితం నేను ఐఫోను కొన్నప్పుడు తెలుగు బాష సరిగ్గా కనపడుటలేదు అని, అది బారతదేశంలో ప్రజలు ఎక్కువగా మాట్లాడే రెండవ అతి పెద్ద బాష అని Apple సపోర్ట్ కి ఒక Mail పంపాను. ఇప్పుడు OS 4.0 లో తెలుగు బాష సపోర్ట్ ని అందించడం బహు సంతసించవలసిన విషయం.

కన్నగాడు said...

@కొత్తపాళి గారు,
ఈ OS ఇంకా విడుదల అవలేదు, బీటా వెర్షన్ డెవలపర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. అటెక్కీలు కంగారుపడాల్సిన అవసరం లేదు, కొత్త OS రాగానే అటెక్కీ సైకాలజీ ప్రకారం ఐట్యూన్సు "ఇక్కడో కొత్త OS ఉంది ఎవరికైనా కావాలా, ఇక్కడో కొత్త OS ఉంది ఎవరికైనా కావాలా" అని అడుగుతుంది.
@రాజేష్ గారు,
నేను మీలా మెయిల్ పంపిన వాళ్లలో ఒకడ్ని.

కొత్త పాళీ said...

ok, thank you.

Google Analytics Alternative