ఉప్పిగానికి నాలుగేండ్లప్పటి సందే ఆళ్ళ ఊరి పేరు రామన్నపేటను ఉప్పన్నపేట అని మార్చేటట్టు చేయాలే అని ఒక పిచ్చి. గదెట్ల ఆనికి బట్టుకుందో ఆనికే తెల్వద్ గని ఏదో ఒకటి జెయ్యాలే అని ఏదేదో చేశేటోడు. ఈడేం జేత్తున్నా ఈని అయ్య మాత్రం నాలుగేండ్లొచ్చినయ్ అని మూల మీద బడిలేశిండు. గా బడిల జేరినప్పటినుంచి ఆనికి ఆ బడంటే గురి లేదు. ఈ బడికి పోకమునుపే వాల్ల సందుల ఉండే పోరగాల్ల తోటి సోపతుండేది. ఆ సోపతిగాల్లల్ల ఒకల్లిద్దరు బడికి పోయేటోల్లు, ఆల్లు బడిల తెల్సుకున్న ఇగ్నాన్నంతా ఈని లాంటోల్లతోటి జెప్పేటోల్లు. గట్లనే కొన్ని బెమ్మ రెహస్యాలు ఎరుకైనయ్ ఈనికి,
పెన్సిల్ చెక్కిన పొట్టును పాలల్ల శానా దినాలెడితే అది లబ్బరైతది (గిదాన్ని సూడ్దానికని ఓనాడు గ్లాసుల పాలు పట్టుకపోతాంటే వాళ్ళమ్మ తొడపాశం ఎట్టింది, దాన్తోటి పాణానికి మంచిది కాదని గా పెయోగం ఒదిలేశిండు)
నెమలీకని పుస్తకంల ఎట్టుకుంటే శానా దినాల తర్వాత పిల్లలెడుతది (గీ పెయోగం చేద్దామనుకున్నడు కని ఈని దగ్గర పుస్తకాలేం ఉండకపోయేటివి, బడికి పోకమునుపు కదా), గిసువంటివి శానా ఉండేటియి.
ఈనికి సోపతిగాల్లంటే ఎంత గురంటే నెమలే అచ్చి దాని ఈకలు పిల్లలు పెట్టదన్న నమ్మకపోయేటోడు. సరిగ్గా గసోంటి టైములనే ఆల్ల అయ్య పష్టు రోజు బడికి కొంచపోయిండు, ఈల్లు పోయేటప్పటికే అక్కడొక టీచరు ఒకనికి ఈపు ఇమానం మోత మోగిత్తాంది. ఆ కొట్టుడు సూస్తనే ఈనికి ఎన్నుల నుంచి భెయ్యం తన్నుకొచ్చింది, పక్కన ఆల్ల నాన్న లేకపోతే ఈపాటికి ఇంటి దాన్క లగెత్తేటోడు. గా టీచరు ఎందుకట్ల ఈరంగం ఏత్తాందని గక్కడ్నే ఉన్న ప్యూన్ ను అడుగుతాండే ఉప్పిగాని అయ్య, గాప్యూన్ ఏంజెప్పిండో గా బెయంల మెదడుకెక్కలే కని ఒక ఇషయం అర్థం అయ్యింది , గా టీచరమ్మ పేరు రేఖ సైన్సు పాటాలు జెప్తది, గా పోరడు నెమలీక పిల్లలు పెట్టదంటే ఇంటలేడని గా టీచరు గట్ల కొడుతుందని, దానితోటే ఈ బల్లే సదువు చెప్పేటోల్లకే రాదని ఫిక్సయ్యే. గీ రేఖ టీచరంటే బడిల పోరగాండ్లందరికీ బెయం, మొదటిసారి మంచిగ జెప్తది, రెండోసారి బుదరకిచ్చి చెప్తది, మూడోసారికి తుమ్మ బరిగె నుండి గంధం తీస్తదని అందరు అనుకునేటోల్లు.
గా బడి మీద నమ్మకం లేకపోయిన గూడా ఏదో రెండేండ్లు సదివేశిండు. ఆనితో పాటే ఆని పిచ్చి గూడా పెరిగింది దానికోసమని పుస్తకం కంట్లవడితే పాపం సదివి(మెదడుకెక్కినా ఎక్కకపోయినా) అవతల పారేత్తాండు. ఆని ధాటికి సంవత్సరం మొత్తం సదువుకోమని ఇచ్చిన టెక్ష్టుపుస్తకాలు పట్టుమని నెలరోజులు పట్టకపోయేది సదివెయ్యడానికి. గీసోంటి టయిముల ఓ దినం ఆల్లకు రేఖ టీచరు "భూమి గుండ్రంగుంటది "అనే పాటం జెప్తాంటే ఈడు పక్కన కూసున్న రవీందరు గాన్తోటి గుసగుస పెడుతుండు. అసలే ముక్కుమీద కోపం ఎట్టుకొని తిరిగే రేఖ టీచరు సూడనే సూశింది, "ఒరే ఉప్పిగా లేశి నేనేం పాటం జెప్తున్ననో చెప్పురా" పిల్లకాకి ఈడు ఎటూ ఇంటలేడు కదా చెప్పలేడు అన్న నమ్మకంతోటి అన్నది. ఈడు ఎంటనే జవాబిచ్చేసరికి టీచరమ్మ జరంత అహం దెబ్బదిని "ఏం గడబిడ జేన్తున్నర్రా ఇద్దరు" అన్నది. అసలే బడిల సదువు జెప్పేటోల్లంతా ఎదవలన్న నమ్మకం ఉండే ఏం జెప్తే ఏమంటదో అని సప్పుడు జెయ్యకుండా ఉన్నడు. జరంత కోపంగ గదే పెశ్నను పక్కన్నే ఉన్న రవీందరు గాడ్ని అడిగింది, ఆడసలే ఉట్టి పిరిగ్గొడ్డు జెప్పన చెప్పిండు "మీరు జెప్తున్న పాటం తప్పంట మేడం, ఈడు కరెక్టుగ జెప్తుండు" ఉప్పిగాని మీదున్న గురితోని ఆడు చెప్పిందే నిజమ్ని నమ్మకంతోటి.
అసలే సైన్సు పాటాలు జెప్పుట్ల థర్టీ ఇయర్స్ ఇండష్ట్రీ ఐన రేఖ టీచరుకు ఆడు చెప్పిందానికి అగ్గిమీద గుగ్గిలం, ఉప్పు, కారం అన్ని అయ్యింది. "ఏందిరా నేను తప్పు జెప్పింది" అన్నది కోపాన్ని ఆపుకుంట. నిల్సోనే ఉన్న ఉప్పిగాడు "భూమి గుండ్రంగా ఉండదు మేడం" అన్నడు బెయపడుకుంటనే. "భూమి గుండ్రంగ ఉండకపోతే అడ్డంగుంటాదిరా" అని కసురుకుంది, "భూమి బల్లపరుపుగ ఉంటది మేడం" ఓ పక్క బయమైతనే ఉన్న మొండి ధైర్ణంతోటి. "గట్లుండదనే కాదురా నేను జెప్పేది మల్లా గట్నే ఉంటదంటవ్"జరంత కోపం పోయేటప్పటికీ బుదర్కిచ్చుకుంట అన్నది. "గుండ్రంగుంటే కింది దిక్కున్నయన్ని కిందవడాలె కదా, అందుకే భూమి గుండ్రంగుండది" వానికొక్కనికే తెల్శిన ఇషయం జెప్తున్నట్టు. "భూమికీ ఆకర్షణ బలం ఉంటదిరా అన్నిటిని దాని దిక్కే లాక్కుంటది కావట్టి కిందకి పడయ్" అన్నది గాడితోటి వాడు కూసుంటడనుకొని సల్లవడ్డది. ఈడేమో పుస్తకాల మీద పుస్తకాలు పిచ్చి పిచ్చి గా సదివే గా ఇగ్నాన్నంతో ఎదవ కొచ్చేన్లు పట్టుకొచ్చిండు "గట్లైతే భుమి వంకరగ కనపడాలే గాని ఎటు దిక్కు సూశినా సక్కంగుంటది కదా" , గీ పెశ్నకు జవాబు తెల్వడంతో టీచరమ్మ గూడ కోపంతెచ్చుకోకుండా మెల్లగ జెప్పింది "భూమి శానా పెద్దగ ఉంటది వంకర కనపడదు, గది కన్పడాల్నంటే శానా ఖాలీ జాగుండాలే. గట్ల కనపడాల్నంటే సముద్రం కాడికి పోవాలే, సముద్రం కట్ట మీద నిల్సోని సూశినవనుకో ఫష్టు దూరం నుంచి వచ్చే పడవ పొగ కన్పిస్తది, దానెన్క పొగగొట్టం కన్పిస్తది, అటెన్క పడవ కనిపిస్తది" అని, పుస్తకంలో ఉన్నది తప్పనడనే భరోసా తోటి. ఈడు "మీరెప్పుడైనా సముద్రం దగ్గర్కి పోయిండ్రా మేడం అని అడిగిండు" గా ఇషయం నాకు బీ తెల్సునన్నట్లు. ఎంటనే మేడం పదేండ్ల నుంచి ఇషాకపట్టనం తీస్కపొమ్మంటే తీస్కపోని సారుని తిట్టుకుంట "లేద"న్నది.
"పుస్తకాలల్ల ఏది రాస్తే గది నమ్మదు మేడం, గా రాశింది నువద్దేనా కాదా అని జరంత సోచాయించి గప్పుడు నమ్మాలి" రెండో తరగతికే పెంపెంచక ఇగ్నానాన్ని మొత్తంగ దమాక్।లో దాస్కున్నట్టు మొఖమొకటెట్టి. మూడో స్టేజిలోకి ఎంటర్ కాబోయి చిన్న పోరడని జరంత తమాయించుకొని "ఎందిరో నోరు లేత్తాంది" అన్నది. "గట్లకాదు మేడం, మన రోడ్ల మీద బొందలుండయా గట్లనే సముద్రంల అక్కడక్కడ బొందలుంటయ్ గాడ నీల్లు కొంచేం లోపలికుంటయ్ కాబట్టి పడవట్ల కన్పిస్తది. గీ పుస్తకంల రాశినోడు సూశిన దగ్గర బొందున్నట్టుంది దానికే మీరు గింత కథ జేయ్యాల్నా" అని ఓ పాలి సోపతోల్ల దిక్కు సూశేసరికి, అందరు ఆన్నో న్యూటను, ఐనుష్టీను కన్నా గొప్పగా సూస్తుంటిరి. అంతేగదా ఆల్లు గూడా భుమి గుండ్రంగుంటదని నమ్మే పెయోగాలు సేశిండ్రు కదా. అప్పటికే మూడో స్టేజిలకొద్దామనుకున్న ఈడికింకో సారి చెప్పి సూద్దామని "మరి భూమి మీదనుంచి పంపిన సాటిలైట్లు తీశిన ఫోటోలల్ల గూడా భుమి గుండ్రంగుంటది కదరా" ఆపుకున్న కోపమంతా మొఖంల కన్పడుతుంటే అన్నది. "మీరే అన్నరు గదా మేడం భూమి శానా పెద్దదని, గా సాటిలైట్లు ఎప్పుడు ఫోటో తీశినా భూమి మీద వెలుతుదు లేనికాడ ఫోటోల వస్తలేదు. ఇప్పుడు గీ బ్లాక్।బోర్డున్నది కదా రాత్రిపుట దీన్ని సూడాల్నంటే టార్చిలైటెయ్యాలె గదా, గప్పుడు బోర్డు లైటు పడ్డదగ్గర్నే గుండ్రంగ కొంచెం కనబడ్తది గని మొత్తం బోర్డంతా కనవడదు గదా. గట్నే సూర్యుడి ఎలుగు భూమ్మీద కొంచెం ప్లేసుల గుండ్రంగ పడ్తది దాన్ని ఫోటో కీంచుతే గుండ్రగున్నట్టొస్తది" వాల్ల ఊరిపేరును ఉప్పన్నపేటగ ఊహించుకుంట కండ్లు మూసుకున్నడు, ఎంతసేపు....మూడో ష్టేజీ లోకి మారిన రేఖ టీచరుకు తుమ్మ బరిగె దొరికేటంత వరకు. ఆ రోజు టీచరు తుమ్మ బరిగె నుండీ తీసిన గంధంలో రక్తం గూడ కలిసిందని ఇప్పటికి ఆని సోపతిగాల్లు అనుకుంటరు.

11 comments:
ఉప్పిగాడు రిటర్న్స్, అగైన్.
ఈ సారి మధ్యలో కొంతసేపు యాస సరిగా పలికినట్లనిపించలా. Too Andhra-ish. అది మధ్యలోనే. మొదలూ చివరా బాగున్నాయ్.
@అబ్రకదబ్ర గారు,
మొదట ఒకసారి రాసి పబ్లిష్ అని కొడితే అది ఎందుకో పబ్లిష్ చేయకపోగా రాసిందంతా ఎగరగొట్టింది, మళ్లీ మొత్తం రాసేటప్పుడు కాస్త గురి తప్పింది.
వర్డ్‌ప్రెస్‌కి మారిపోండి. అదైతే ఐదారు నిమిషాలకి ఆటోసేవ్ చేస్తుంది :-) (మీ బ్లాగర్‌లో స్మైలీస్ కూడా లేవు!)
@అబ్రకదబ్ర గారు,
వర్డ్।ప్రెస్సుకి వకాల్తా పుచ్చుకున్నట్టున్నారు, బ్లాగరు కూడా ఒకటి రెండు నిమిషాలకోసారి సేవ్ చేస్తుంది కాని కొత్తగా బ్లాగర్లో వచ్చిన డ్రాఫ్ట్।లో ఎక్కడో ఏదో తేడా ఉంది నాకింకా కరెక్టుగా తెలియలేదు.
ఇంతకుముందు ఒకసారి వర్డ్।ప్రెస్ ప్రయత్నిద్దామని చూసా కాని ఎందుకో అంత నచ్చలేదు, మరోసారి ప్రయత్నించి చూద్దామనుకుంటున్నా.
బ్లాగర్ కూడా ఆటో సేవ్ చేస్తుంది, ఐదునిమిషాలకంటే తరచుగానే. స్మైలీలు లేకపోవడం లోపమే.
నాక్కూడా చాలా సార్లు అలాగే జరిగింది ..మళ్ళీ రాసేసరికి ఏడుపొచ్చేది..అయినా డ్రాఫ్ట్ గా సేవ్ అవుతుంది కదా?? అది కాకుండా పేరగ్రాఫ్ లుగా విడ గొట్టేటపుడు చాలా పదాలు ఎగిరిపోతున్నాయి.. ఏంటో మరి .. ..కాని పోస్ట్ మాత్రం బాగా రాసారు :)
@నేస్తం గారు,
నేనన్న డ్రాఫ్ట్, బ్లాగర్లో కొత్త పరికరం గురించి ఇందులో బ్లాగు థీంను ఎడిట్ చేసుకోవడం లాంటివి చేయవచ్చు. ఈ ఐచ్చికాన్ని ఎంచుకున్నప్పుడు పోస్ట్ రాసేటప్పుడు చాలా ఆప్షన్స్ రావట్లేదు ఉదా: బోల్డ్, అలైన్మెంటు లాంటివి. ఈ డ్రాఫ్ట్ ఐచ్చికాన్ని వదిలేసానింక.
ఇది చదివిన తరువాత, మా చిన్నప్పుడు హింది మాష్టరు (రామనాధం గారు, R.P.B.S ZP High School, SriKalahasthi) చెప్పె పిట్ట కథలు గుర్తుకు వస్తున్నాయి.
ఒక పిల్లవాడు, బడిలో చెప్పిన భూమి గుండ్రముగా వుండును అనే పాఠం ఇంట్లో చదువుచున్నాడు. తండ్రి విని, అయ్యోరు సరిగ్గానే చెప్పుంటారు కాని వీడు సరిగ్గా విని వుండడని - వాడిని గదమాయించి, భూమి బల్లపరుపుగా వుండునని చెప్పాడు.మరుసటి రోజు వాడికి బడిత పూజతో భూమి గుండ్రముగా వుడును అని అయ్యవారు నేర్పారు.ఇంటికి వచ్చినప్పుడు అయ్య చేతిలో వీపువిమానం మోతతో భూమి బల్లపపరుపు అని చెప్పించుకోవడం జరిగింది.మూడో రోజుకి వాడి జవాబు ఏంటంటె - బళ్ళో గుండ్రంగాను, ఇంట్లో బల్లపరుపుగాను ఉంటుంది.
Nice post sir..
@మూడో పురుషార్థమ్ గారు,
Thanks
కన్నగాడు గారూ...,
నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.
తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .
మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.
- హారం ప్రచారకులు.
Post a Comment