Saturday, July 17, 2010

కల, కలకు కల, కలలో కల వెరసి కలకు 'ఇన్।సెప్షన్'

కథ చెప్పడంలో ఉద్దండుడు దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ (christopher nolan), తన గత చిత్రాలైన ఫాలోయింగ్, మెమెంటోలతో కథ చెప్పడంలో తనకంటూ ఒక శైలిని ఏర్పరుచుకున్నాడు. ఏంతో సంక్లిష్టతతో కూడుకున్న 'ఇన్।సెప్షన్' కథను వీలైనంత సరళంగా చెప్పడానికి ప్రయత్నించాడు, ప్రయత్నమైతే చేసాడు కాని కథావస్తువులో ఉన్న సంక్లిష్టత చూస్తున్న వాళ్ల మెదడుని క్షణం కూడా విశ్రాంతి తీసుకోనివ్వదు. ఇప్పటివరకు ఈ దర్శకుడు తీసిన ఫాలోయింగ్(విధ్యార్థి దశలో ఆరువేల డాలర్లతో తీసిన అద్భుతమైన సినిమా, సాధారణంగా ఇండిపెండెంట్ చిత్రాలలా ఇది హర్రర్ సినిమా కాదు) తర్వాత తన సొంత రచనతో తీసిన మొదటి సినిమా. మిగతా అన్ని సినిమాలు(Memento, Insomnia, Batman Begins, The Prestige, The Dark Knight) నవలలనో లేదా కామిక్ పుస్తకాలనో ఆధారంగా తీసినవే. ఈ కథ తయారు చేయటానికి దాదాపు ఎనిమిది సంవత్సరాలు పట్టిందట.
ఇక విషయాని కొస్తే, లియొనార్డో డి కాప్రియో ప్రధాన పాత్రలో $170 మిలియన్లు ఖర్చుతో వార్నర్ బ్రదర్స్ ఈ వేసవికి విడుదల చేసారు(యుకేలో పదహారు జులైన).కాబ్(డి కాప్రియో) ఒక విచిత్రమైన దొంగ. ప్రముఖులను కలలోకి పంపి ఆ కలలలో వారి రహస్యాలను దొంగతనం చేయడంలో దిట్ట. అతను సాటో వద్ద పని చేస్తుంటాడు. తను పనికి సంబంధించిన కారణాల వలన తన కుటుంబానికి దూరంగా ఉండవలసి వస్తుంది. అటువంటి సమయంలో సాటో కాబ్ ని ఇన్।సెప్షన్ చేయమని కోరతాడు, ఆ పని పూర్తయితే కాబ్ శాశ్వతంగా తన కుటుంబంతో కలిసి ఉండవచ్చని ప్రతిపాదన తేవడంతో కాబ్ ఇన్।సెప్షన్ చేయడానికి సిద్దమవుతాడు.

ఇన్।సెప్షన్ అంటే ఏమిటి, కాబ్ సమర్ధవంతంగా పని పూర్తిచేయగలిగాడా, ఆ ప్రక్రియలో తనకెలాంటి పరిస్థుతులెదురైనాయి అనేది సినిమా. ఖర్చు చేసిన ప్రతీ పైసను తెరపై సమర్ధవంతంగా చూపాడు, సినిమాలో ప్రధానంగా ఆరేడు పాత్రలకి మించకున్నా సినిమా పూర్తయిన తరువాత కేవలం ఛాయాగ్రహణం, మెదడుని తొలుస్తున్న కథ తప్ప ఏ పాత్ర గుర్తుకు రాదు. అలాగని ఎవరు బాగా చేయలేదని కాదు, కథావిషయం(కథ కాదు), ఛాయాగ్రహణం ప్రభావం అలాంటిది. అసలే కథలో ఉన్న సంక్లిష్టత మెదడుకు పని చెబుతుంటే, ఫోటోగ్రఫీ కళ్ళకు పని చెబుతుంది. ఈ సినిమా చిత్రీకరణకు ఎక్కువ శాతం CGI బదులు కెమెరాలానే ఆశ్రయించారు , ప్రస్థుతానికి ట్రైలర్లలో చూపిస్తున్న నగరం పైకి లేచే సన్నివేశం ఒక సెట్।ని హైడ్రాలిక్స్।తో పైకి లేపి తీసారంట. భూమ్యాకర్షణ లేని సమయంలో తీసిన పోరాటాలు అద్భుతంగా ఉన్నాయి.

సినిమా చూస్తూ మెదడుకు మేత వేయాలనుకునే వాళ్ళు తప్పకుండా చూడవలసిన సినిమా.

చివరగా: జేబులో రెండు టిక్కెట్లు కొనడానికి డబ్బులుంటేనే వెళ్ళండి, మొదటిసారే అర్థమయితే అద్భుతాన్ని మరొకసారి చూడాలన్న ఉత్సుకత మిమ్మల్ని రెండోసారి వెళ్ళేలా చేస్తుంది, మొదటిసారి అర్థంకాకపోతే రెండోసారి చూడాటానికి :)

13 comments:

సవ్వడి said...

good.....

అబ్రకదబ్ర said...

This guy doesn't know how to make a bad movie.

శరత్ 'కాలమ్' said...

గుడ్. చూడాలని నిర్ణయించుకున్నాను. స్పెషల్ ఎఫెక్ట్ ఎలా తీసారో చెప్పి వుండాల్సింది కాదు. ఇప్పుడు ఆ సీన్ చూసేటప్పుడు నేను తాద్మాత్యం చెందలేకుండా అయ్యింది. మీరు చెప్పిన క్రేన్లే గుర్తుకువస్తాయి. హ్మ్. ఇందుమూలంగా మీరు నాకు కనీసం ఒక డాలర్ నష్టపరిచారు. వెంటనే ఆ డాలర్ పంపించే ఏర్పాటు చేయండి. లేకపోతే నష్తపరిహారం కేసేస్తా!

హరే కృష్ణ said...

మొదటిసారే అర్థమయితే అద్భుతాన్ని మరొకసారి చూడాలన్న ఉత్సుకత మిమ్మల్ని రెండోసారి వెళ్ళేలా చేస్తుంది, మొదటిసారి అర్థంకాకపోతే రెండోసారి చూడాటానికి :) :D :D

మొదటి సారి చూసాక in a state of limbo :)


its a masterpiece
very well written

కన్నగాడు said...

@సవ్వడి గారు, ధన్యవాదాలు.
@అబ్రకదబ్ర గారు, నిజమే చెడ్డ సినిమాలు తీయలేకపోవడమే కాదు, స్క్రీన్।ప్లేని జాగ్రత్తగా ఉల్లిపొరల్లాగ రాసుకోవడంలోను దిట్ట. దాదాపు అన్ని సినిమాలు రెండు, మూడో సారి చూసినా కూడా ఇంతకుముందు కనిపించని ఏదో కొత్త కోణం ఆవిష్కరిస్తుంది, ఇంతకీ సినిమా చూసారా!
@శరత్ గారు,
తప్పకుండా చూడండి, ఇక నేను చెప్పింది ప్రమోషన్లో భాగంగా ఊదరగొట్టిన విషయమే(బహుషా మీరా సమయంలో కలలో ఉన్నట్టున్నారు) కాబట్టి నష్టపరిహారం ఇవ్వబడదు. ఇంకా ఏమైనా మాట్లాడాలంటే మా వకీలు రాం 'ఫట్'మలానీతో మాట్లాడొచ్చు.
@హరేక్రిష్ణ గారు,
అది రాసినప్పటికి నేనింకా హాంగోవర్లో ఉన్నాను, తర్వాతి రోజే ఇంకోసారి వెళ్ళా, ఎక్కడా విసుగనిపించలేదు

హరే కృష్ణ said...
This comment has been removed by the author.
హరే కృష్ణ said...

కన్నగాడు గారు,
4th dream లో limbo స్టేట్ లో ఉన్నప్పుడు Eames(Forger) Jr. Fisher తో ఒక డైలాగ్ అంటాడు సన్నివేశం అర్ధం అయ్యింది తన decision తీసుకున్నాడు అని

ఆ డైలోగ్ ఏమన్నా మీకు కాస్త గుర్తుందా
నేను సబ్ టైటిల్స్ కోసం తెగ గూగిలిస్తున్నా ప్చ్చ్ దొరకట్లా :(

మూడోసారి వెళ్దామంటే హిట్ టాక్ తెప్పించేసి టికెట్స్ దొరకనివ్వకుండా చేసేసారు వా :(

నచికెత్ said...

నేనూ చూశాను.. సగం సగం అర్ధం అయ్యింది, మల్లీ చూడాలి. ఇంతకు ముందు క్రిష్టఫర్ నోలన్ సినిమాలు మెమెంటో, ప్రెస్టీజ్ చూసినప్పుడు కూడా ఒక సారి చూస్తే అర్ధం కాలేదు, మల్లీ మల్లీ చూడాల్సిందే.

ఒక సినిమాని ప్రేక్సకులకి మల్లీ మల్లీ చూపించడానికి మన వారు ఉపయోగించే టెక్నిక్ మంచి పాటలు పెట్టి బ్రహ్మానందం కామెడీ అదరగొట్టడం. అదే ఇంగ్లీషు వారి తెక్నిక్ స్టోరీని బాగా కాంప్లికేట్ చేసి అర్ధం కాకుండా తియ్యడం.

కన్నగాడు said...

@హరే కృష్ణ గారు,
లింబోకి Cobb(DiCaprio), Ariadne(Ellen Page), Saito(Ken Watanabe) మాత్రమే వెళతారు.
మొదటి కల వ్యాను నీళ్ళలో పడడం, రెండవది భూమ్యాకర్షణ లేని హోటలు, మూడవది మంచులో, నాలుగవది లింబో.
ఒకవేళ మీరు చెప్పే సన్నివేశం నీళ్ళలోంచి బయటకు వచ్చిన తరువాతది(ఆ సన్నివేశంలో పిషర్ ముందు నుంచి కెమెరా రోల్ అవుతుంటే ఫోర్జర్ తన సొంత రూపానికి మారుతాడు) ఐతే, అది మొదటి కల. ఆ సన్నివేశంలో ఫిషర్ "నా కాళ్ళ మీద నిలబడ్డ నన్ను చూడాలని నాన్న గారు ఆశిస్తున్నారు, నేను నిలబడతాను" అంటాడు.

@నచికేత్, మెంమెటో స్క్రీన్।ప్లే అయోమయంలో పడేస్తుంది కానీ ప్రెస్టీజ్, ఇన్।సెప్షన్, ఫాలోయింగు లని అంతరాయం లేకుండా చూస్తే అంత అయోమయంగా ఉండదు.

హరే కృష్ణ said...

thanks a lot
నిజమైన inception ఫ్యాన్ మీరే
మీరు ఇచ్చిన సమాధానం లోనే ఉంది
మీకు సినిమా ఎంత బాగా జీర్నిన్చుకుపోయిందో :)

cobbs projection Mal 3rd లెవెల్ లో ఫిషేర్ ని చంపుతుంది
limbo లోకి Mal కూడా ఉంటుంది కదా obvious గా :)


thanks again

కన్నగాడు said...

@హరే క్రిష్ణ గారు, నేను సినిమాకు అభిమానిని ఇన్।సెప్షన్।కి మాత్రమే కాదు :)

swathi said...
This comment has been removed by the author.
కన్నగాడు said...

@swathi,
మొదటి రోజు ఎలాంటి అంచనాలు లేకుండా బాగున్న సినిమా చూసినా అద్భుతంగా ఉంటుంది, అలాంటిది కత్తిలాగున్న సినిమా ఎలా ఉండాలి. :)

Google Analytics Alternative